Skip to main content

Namaste NRI

మను చరిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

శివ కందుకూరి హీరో గా నటించిన చిత్రం మను చరిత్ర.   భరత్ పెదగాని దర్శకుడు. ప్రొద్దుటూరు టాకీస్ బ్యానర్‌పై ఎన్.శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు.  ఈనెల 23న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిధిగా పాల్గొన్న హీరో కార్తికేయ మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్, టీజర్ చాలా హార్డ్ హిట్టింగ్‌గా వున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది అని చెప్పారు.

దర్శకుడు భరత్ పెదగాని మాట్లాడుతూ మను చరిత్ర చాలా స్వచ్చమైన కథ. ఇందులో మేఘ ఆకాష్ పాత్ర గుర్తుండిపోతుంది. గరిమ ది కూడా చాలా కీలకమైన పాత్ర. శివ నా ఫస్ట్ లవ్ . ఇందులో ఆయన చాలా మందిని ప్రేమిస్తాడు. నేను మాత్రం ఆయన్నే ప్రేమిస్తా అని తెలిపారు.

 హీరో శివ కందుకూరి మాట్లాడుతూ ఈ సినిమా కోసం దర్శకుడు భరత్ చాలా కష్టపడ్డాడు. చాలా ప్రేమిస్తూ చేసిన స్క్రిప్ట్ ఇది. ఈ సినిమా నటుడిగా ఎన్నో విషయాలు నేర్పించింది అని అన్నారు.  ఈ వేడుకలో రాజ్ కందుకూరి, అజయ్ భూపతి, బెక్కం వేణుగోపాల్, కొండా విజయ్ కుమార్, శేఖర్ రెడ్డి, రక్షిత్, ప్రగతి శ్రీవాస్తవ్, గరిమ తదితరులు పాల్గొ న్నారు.

Social Share Spread Message

Latest News