శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా మను చరిత్ర. ప్రొద్దుటూర్ టాకీస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి ఈ చిత్రాన్న నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకుడు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు . ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ నటుడిగా నన్ను మొదటినుంచి ప్రోత్సహిస్తున్న వ్యక్తి రాజ్ కందుకూరి. ఆయన తన కొడుకు శివలాగే నన్నూ చూసుకుంటారు. ట్రైలర్ బాగుంది. లవ్, యాక్షన్ తరహా చిత్రాలను ఇష్టపడుతుంటాను.ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం కలుగుతున్నది అన్నారు.
దర్శకుడు భరత్ పెదగాని మాట్లాడుతూ ఈ సినిమా సరికొత్త ప్రేమ కథగా ఆకట్టుకుంటుంది. శివ, మేఘా నటన మెప్పిస్తుంది. ఈ టీమ్‌తో మరోసారి పనిచేయాలనుంది అని చెప్పారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ డ్యాన్స్, ఫైట్స్ చేయాలని ప్రతి నటుడికీ ఉంటుంది. ఈ సినిమా నాకు అలాంటి అవకాశం కల్పించింది. ఎవరినీ నిరాశపర్చని మంచి సినిమా అవుతుంది అన్నారు. ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, నాయిక మేఘా ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.