భారతదేశంలోని పేదలకు సాయం చేసేందుకు అమెరికాలోని ఎన్నారైలు, ఇండో-అమెరికన్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా 2023, మార్చి 2న ఇండియా గివింగ్ డే ను నిర్వహించబోతున్నాయి. ఇండియా ఫిలాంత్రఫీ అలయెన్స్ పేరుతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అగస్త్య యూఎస్ఏ తో పాటు అమెరికాలోని పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటున్నాయి. అమెరికాలోని ఎన్నారై, ఇండో అమరికన్ల సమూహంలో ముఖ్యంగా యువతీయువకులలో దాతృత్వ గుణం పెంపొందించేందుకు ఇండియా గివింగ్ డే ఒక సువర్ణావకాశం. ఈ ఇండియా గివింగ్ డే లో పాల్గొంటున్న అగస్త్య యూఎస్ఏ సంస్థ అమెరికాలోని ఎన్నారైలు, ఇండో అమెరికన్ల నుంచి విరాళాలను ఆశిస్తోంది. అమెరికాలో అత్యధికంగా సంపాదిస్తున్న ప్రవాస భారతీయులు 24 గంటల చారిటబుల్ డ్రైవ్లో పాల్గొని, తమ మాతృభూమి రుణం తీర్చుకునే గొప్ప అవకాశం ఇండియా గివింగ్ డే కల్పిస్తోంది. అమెరికాలో నివసిస్తోన్న 2.7 మిలియన్ల ప్రవాస భారతీయులు, అమెరికాలో పుట్టిన భారతీయ సంతతికి చెందిన 1.3 మిలియన్ల ఇండో-అమెరికన్ల నుంచి విరాళాలను ఆశిస్తోంది.