
ట్రంప్ టారిఫ్‌ల మోతతో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ కెనడా కొత్త ప్రధాని ఎన్నిక జరుగనుంది. మాజీ బ్యాంకరైన మార్క్ కార్నీ కొత్త ప్రధానిగా నియమితులయ్యే అవకాశం ఉన్నది. అధికార లిబరల్ పార్టీ ఆదివారం సమావేశమై కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నది. వరుస రాజకీయ సంక్షోభాల నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్టు గత జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాతో సంబంధాలు చెడిన ప్రస్తుత తరుణంలో కొత్త ప్రధానికి పలు కీలక సవాళ్లు ఎదురుకానున్నాయి. ఈ ఏడాది చివరిలో కెనడా పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.
