Skip to main content

Namaste NRI

హీరో శ్రీ విష్ణు చేతుల మీదగా మార్కెట్ మహాలక్ష్మి టీజర్ రిలీజ్

పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా రూపొందుతోన్న చిత్రం మార్కెట్‌ మహాలక్ష్మి. వీఎస్‌ ముఖేష్‌ దర్శకుడు. అఖిలేశ్‌ కలారు నిర్మాత. హర్షవర్దన్‌, మహబూబ్‌ బాషా, ముక్కు అవినాష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వర లో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ని హీరో శ్రీవిష్ణు లాంచ్‌ చేశారు. సినిమా మంచి విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని, నిర్మాతకు ఆర్థికంగా లాభాలు చేకూరలని ఆకాంక్షించారు. సినిమాలో నటించడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు.  ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌ మొత్తం పాల్గొ న్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిస్టర్‌ జో, కెమెరా: సురేంద్ర చిలుముల.

Social Share Spread Message

Latest News