Namaste NRI

ఆటా ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక

ఆటా ఆధ్వర్యంలో అట్లాంటాలో సెప్టెంబరు 9న వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. వధూ వరులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని తమ జీవిత భాగస్వామిని కుటుంబ వాతావరణంలో ఎంచుకునే సదవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలని ఆటా కోరింది. ఈ కార్యక్రమం ఆధునిక సమాజంలో అబ్బాయిలకి, అమ్మాయిలకి స్వయంవరం లాంటిదని ఆటా పేర్కొంది. ఈ మంచి అవకాశం మన ఆటా మీ ముందుకు అట్లాంటాలో ఏర్పాటు చేస్తుందని ఎన్నారైలు తెలిపారు. వధూ వరులు, తల్లి తండ్రులు, మిత్రులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events