సంతోష్ శోభన్ నటిస్తున్న చిత్రం కళ్యాణం కమనీయం. ప్రియ భవానీ శంకర్ నాయిక. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా కళ్యాణం కమనీయం సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ టైటిల్ మోషన్ పోస్టర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. అందమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకుంది. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మిస్తూ యువ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రంతో మరో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ప్రేక్షకులకు అందించబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహ రాజు, రచన దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్.
