రష్యాలో విలీనం చేసుకున్న నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాల్లో నేటి నుంచి మార్షల్ లా విధిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ చట్టం కింద చేపట్టే చర్చలేమిటనేది ఆయన వెంటనే చెప్పకపోయినా ఆ ప్రాంతాల అధిపతులకు అదనంగా అత్యవసర అధికారాలు ఇస్తున్నట్లు మాత్రం వెల్లడిరచారు. విలీన ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న వేళ పుతిన్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. విలీన ప్రాంతాల ప్రాదేశీక రక్షణకు అవసరమైన నిర్ధిష్ట ప్రతిపాదనల్ని భద్రత బలగాలు మూడు రోజుల్లో సమర్పించాల్సి ఉంటుంది. రష్యా భద్రత, సురక్షితమైన భవితవ్యం, ప్రజా రక్షణ కోసం ప్రయత్నిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ముందున్నవారు, శిక్షణ కేంద్రాల్లో ఉన్నవారు తమ వెనుక గొప్పదేశమంతా ఉందని భావించాలి అని రష్యా భద్రత మండలి సమావేశాన్ని ఉద్దేశించి పుతిన్ తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)