రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. 80వ దశకంలో స్టూవర్టుపురంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. ఈ చిత్రంలో నూపూర్ ససన్, గాయత్రి భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల సినిమాలోని రెండో గీతం వీడు విడుదలైంది. హీరో స్వభావాన్ని ఆవిష్కరిస్తూ మాస్ అంశాలతో ఈ పాట ఆకట్టుకుంది. అందరు ఆగిన చోట మొదలవుతాడు వీడు. ఎదగడమే జన్మ హక్కంటాడు వీడు అంటూ సాగిన ఈ గీతాన్ని జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరిచారు. చంద్రబోస్ సాహిత్యాన్నందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ పాట మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని, విజువల్స్ బిగ్‌స్క్రీన్‌పై కొత్త అనుభూతిని పంచుతాయని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, రచన-దర్శకత్వం: వంశీ. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.