రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ధమాకా. డబుల్ ఇంపాక్ట్ ఉప శీర్షిక. పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల నాయికగా నటిస్తున్నది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రేమికుల రోజు కావటంతో రవితేజ, శ్రీలీల జంటగా ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ యంగ్ అండ్ డైనమిక్‌గా కన్పిస్తున్నారు. శ్రీలీల క్యూట్‌గా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ప్రణవి అనే చలాకీ అమ్మాయిగా కథానాయిక శ్రీలీల కనిపిస్తుంది. కథాగమనంలో ఆమె పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: భీమ్స్ సిసిరిలియో, ప్రొడక్షన్ డిజైనర్ : శ్రీనాగేంద్ర తంగల, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణ సంస్థలు: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకత్వం : త్రినాథరావు నక్కిన. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)