కిరణ్ అబ్బవరం హీరో గా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్ . నేహాశెట్టి ఈ సినిమాలో హీరోయిన్. రత్నం కృష్ణ దర్శకత్వం. ఈ చిత్రానికి అమ్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్దార్థ్ సేన్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఎందుకురా బాబు అంటూ సాగే మాస్ బీట్‌ను రిలీజ్ చేశారు. అమ్రిష్ స్వరపరిచిన ఈ పాటను రాహుల్ సిప్లీగంజ్, రేవంత్ ఆలపించారు. ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు గట్రా సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేశాయి.