రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ధమాకా. దీపావళిని పురస్కరించుకుని మాస్ క్రాకర్‌ని పేల్చనున్నారు. ఈ టీజర్‌ని అక్టోబర్ 21న విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవి తేజకి జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత. ప్రసన్నకుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. రవితేజ మార్క్ వినోదంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని మాస్ క్రాకస్ పేరుతో విడుదల చేస్తున్నామని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్, అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. త్వరలోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు.