రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా అభిమన్యు బద్ది దర్శకత్వం వహిస్తున్న సినిమాకి మాటే మంత్రము అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హీరో రాహుల్ విజయ్ బర్త్ డే (జూన్ 7) సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఎ.సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ గోవా నేపథ్యంలో జరిగే రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. సుశాంత్ రెడ్డి, అందించిన కథ ఆసక్తిగా ఉంటుంది. హైదరాబాద్, గోవా లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. మా సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఆద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నాం అన్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో ఎ.సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: మనోజ్ రెడ్డి. ఎడిటర్: ప్రవీణ్‌పూడి.














