Namaste NRI

క్రైమ్‌ డ్రామాగా ఆకట్టుకునే జగమే మాయ

 ధన్య బాలకృష్ణన్‌, తేజ ఐనంపూడి, చైతన్య రావ్‌, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జగమే మాయ. ఈ చిత్రాన్ని జ్యాపీ స్టూడియోస్‌ పతాకంపై ఉదయ్‌కిరణ్‌ కోటా, విజయ్‌ శేఖర్‌ అన్నే నిర్మించారు. క్రైమ్‌డ్రామా కతతో దర్శకుడు సునీల్‌ పుప్పాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 15న నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా హైదరాబాద్‌లో చిత్ర  ప్రీమియర్‌ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ  ఒక చిన్న ఇంట్రెస్టింగ్‌ ఐడియా మీద వెళ్లే సినిమా అన్నారు. మనలో ఎవరూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ లాంటి వ్యక్తిత్వం కలిగి ఉండటం అందరిలోనూ గ్రే షేడ్స్‌ ఉంటాయని చెప్పే కథ అన్నారు.  తేజ ఐనంపూడి మాట్లాడుతూ  మీకొక మంచి సినిమా చూపించామని ఆశిస్తున్నాము. జీవితంలో మనం ఒకరికి చెడు చేయాలని చూస్తే ఆ ఛాన్స్‌ మనకే జరుగుతుందని చెప్పే చిత్రమిది. నాకు ఇలాంటి మంచి రోల్స్‌ ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్‌ అన్నారు.  దర్శకుడు సునీల్‌ నాకు కథ చెప్పినపుడు   మీ కళ్లతోనే నటించాల్ని ఉంటుందని అన్నారని, ఆ  పాత్రలోని ఇంటెన్సిటీ అపుడే అర్థమైందన్నారు.  నేను బాగా నటించానని అనుకుంటున్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో  తేజ ఐనంపూడి, సంగీత దర్శకుడు అజయ్‌ అరపాడ, దర్శకుడు సునీల్‌ ఉప్పాల, చిత్ర నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News