Namaste NRI

మాయాపేటిక ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌

పాయల్‌ రాజ్‌పుత్‌, సునీల్‌, విరాజ్‌ అశ్విన్‌, రజత్‌ రాఘవ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మాయా పేటిక. ఈ చిత్రాన్ని జస్ట్‌ ఆర్టినర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై మాగుంట శరత్‌ చంద్రారెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. రమేష్‌ రాపార్తి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడ్రీ డ్రామాగా తెరకెక్కుతున్న  ఈ చిత్రానికి సంబంధించిన  ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను అనసూయ భరద్వాజ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్‌ చూశాను చాలా బాగుంది.  సినిమా కూడా అందరికీ నచ్చుతుంది అన్నారు.   దర్శకుడు రమేష్‌ రాపార్తి మాట్లాడుతూ  ఈ చిత్ర స్క్రిప్ట్‌ సరికొత్తగా ఉంటుంది. సెల్‌ఫోన్‌ మోడల్‌గా ఈ సినిమా రూపొందించాం. ఫోన్‌లో ఉన్నట్లే ఇందులో మంచి విజువల్స్‌, పాటలు, కామెడీ లాంచి ఫీచర్స్‌ ఉంటాయి అన్నారు. నటి పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ ఇలాంటి చిత్రంలో అవకాశం రావడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ కథ కోసం దర్శకుడు మంచి రీసెర్చ్‌ చేశారు. ఇప్పటిదాక నేను కనిపించని క్యారెక్టర్‌ ఇందులో పోషించాను అని చెప్పింది. ఈ కార్యక్రమంలో సిమ్రత్‌ కౌర్‌, రజత్‌ రాఘవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress