వాసుకీ, మయూఖి, ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మయూఖి. ఏఎల్ నితిన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని నందకుమార్, డి.టెరెన్స్ సంయుక్తంగా నిర్మించారు. హైదరాబాద్‌లో ఈ సినిమా పోస్టర్‌ను దర్శకుడు విమల్ కృష్ణ, రచయిత డార్లింగ్ స్వామి ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ మేన కోడలి కోసం మేనమామ చేసే సాహసాల నేపథ్యంలో సాగే చిత్రమిది. చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరిగింది అన్నారు. యాక్షన్, అడ్వెంచర్ మూవీగా ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డీజే టీల్లు దర్శకుడు విమల్ కృష్ణ, రచయిత డార్లింగ్ స్వామి పాల్గొన్నారు.