దర్శకుడు త్రినాథరావు నక్కిన, సందీప్‌కిషన్‌తో మజాకా చేస్తున్నారు. రాజేష్ దండా నిర్మాత. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా టైటిల్, రిలీజ్ టైమ్‌తో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సందీప్‌కిషన్ పర్‌ఫెక్ట్ సంక్రాంతి చిన్నోడిగా కనిపించారు. సంప్రదాయ పంచె కట్టు, చొక్కా ధరించి, భుజంపై పెద్ద టేప్‌రికార్డర్‌తో కూర్చీపై కూర్చొని ఎంటైర్టెన్మెంట్ మోడ్‌లో కనిపిస్తున్నా రు. రావు రమేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: లియోన్ జేమ్స్, సహనిర్మాత: బాలాజీ గుత్తా, నిర్మాణం: ఏకే ఎంటైర్టెన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్.