అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ మహాసభలో అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య రాసిన నేను నా అమరావతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బాలకోటయ్య మాట్లాడుతూ అమెరికాలోని తానా సభలో నేను రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ప్రజారాజధాని అమరావతి నాకు ఇచ్చిన గొప్ప వరం అన్నారు. అమరావతిపై రాసిన పుస్తకం అమెరికాలో ఆవిష్కరిస్తానని ఊహించలేదు. నా జన్మ ధన్యమైంది. వేల కి.మీ. ప్రయాణం చేసి మీ ముందుకు వచ్చాను. చరిత్ర లిఖించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భావితరాలకు అమరావతి ఉద్యమ స్ఫూర్తి, భూములు ఇచ్చిన రైతుల గురించి తెలియదు. వారి త్యాగం నాలుగైదు మాటల్లో చెప్పేదికాదు. అదొక అద్భుతం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ప్రసాద్ , శ్యామ్ అరబింది, అప్పసాని రాజేష్, మహాసేన రాజేష్, లక్ష్మి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.















