Skip to main content

Namaste NRI

మెకానిక్‌ రాకీ ఫస్ట్ సింగిల్.. గుల్లెడు గుల్లెడు సాంగ్ రిలీజ్‌

విశ్వక్‌సేన్‌, మీనాక్షిచౌదరి, శ్రద్ధాశ్రీనాథ్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న మాస్‌, యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెకానిక్‌ రాకీ. ముళ్లపూడి రవితేజ దర్శకుడు. రామ్‌ తాళ్లూరి నిర్మాత. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు. ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేశారు. గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే.. ఇంక నాతో ఉంటడే అంటూ సాగే పాటను సుద్ధాల అశోక్‌తేజ రాయగా, జేక్స్‌ బెజోయ్‌ స్వరపరిచారు. మంగ్లీ ఆలపించారు. విశ్వక్‌సేన్‌, మీనాక్షి చౌదరిలపై చిత్రీకరించిన ఈ పాటలో డాన్స్‌ మూమెంట్స్‌ను డాన్స్‌మాస్టర్‌ యష్‌ సంప్రదాయబద్ధంగా, ఆకర్షణీయంగా డిజైన్‌ చేసినట్టు మేకర్స్‌ చెబుతున్నారు. అక్టోబర్‌ 31న దీపావళి కానుకగా సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌ కాటసాని, నిర్మాణం: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

Social Share Spread Message

Latest News