ఐదు విభిన్న కథల ఆంథాలజీగా రూపొందిన చిత్రం మీట్ క్యూట్. సత్యరాజ్, ఆదా శర్మ, రోహిణి, ఆకాంక్ష సింగ్, శివ కందుకూరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని నిర్మించారు. ఈ నెల 25 నుంచి ఈ వెబ్ సిరిస్ సోని లివ్ ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా దీప్తి .మీడియాతో మాట్లాడుతూ ప్రయాణాల్లో కొత్తవాళ్లతో మాట కలపడం నాకు అలవాటు. అలాంటి అపరిచిత వ్యక్తుల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది? అనే ఊహతో స్క్రిప్ట్ మలిచాను. దాంతో పాటు మన జీవితంలో ఎదురయ్యే ఆహ్లాదకరమైన సంఘటలను ఇందులో చూపిస్తున్నాం అన్నారు, నాని మాట్లాడుతూ ఈ స్క్రిప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మా సిస్టర్ కాకుండా దీన్ని ఎవరు రాసిన ప్రొడ్యూస్ చేసే వాడిని. మీట్ క్యూట్ లో పాత్రలు, మాటలు, సందర్బాలు అన్నీ సహజంగా ఉంటాయి. చూస్తున్నకొద్దీ అవి ఎలా ముందుకెళ్తాయి? ఎలా ముగుస్తాయి? అన్న ఆసక్తి పెరుగుతుంది అన్నారు.
