అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్ తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం నల్లమల్ల. అజయ్‌ఘోజ్, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అమ్మ లాంటి ఆవును కాపాడుకోలేకపోతే మనుగడ లేదనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం. కథలోని సందేశం ప్రేక్షకులకు చేరువైంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నిరూపించింది అన్నారు. కథానాయిక భానుశ్రీ మాట్లాడుతూ కథలో కొత్తదనంతో పాటు విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. మంచి కథాంశంతో తెరకెక్కిన సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. రవిచరణ్ దర్శకత్వంలో ఆర్.ఎమ్ నిర్మించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : వేణు మురళి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)