ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, నారిస్ టౌన్ లో ఏప్రిల్ 15వ తేదీన, ప్రతిష్టాత్మక తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం జరిగింది. జులై 7, 8, 9వ తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే మహాసభలను జయప్రదం చేసేందుకు ప్రస్తుత కార్యాచరణ, మహాసభల అతిధుల ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డెలావేర్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా రాష్ట్రాలనుండి మహాసభల కమిటీ సభ్యలు హాజరై వారి కమిటీల పురోగతి స్థితులను, సమగ్ర ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా అక్కడకి వచ్చిన కమిటీ సభ్యులు తానా వ్యవస్థాపకులు, తొలి అధ్యక్షులు స్వర్గీయ శ్రీ కాకర్ల సుబ్బారావుగారి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించారు.