
అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విశ్వంభర. త్రిష కథానాయిక. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వంభర సెట్‌లో నటి శ్రీలీల సందడి చేసింది. వుమెన్స్ డే సందర్భంగా విశ్వంభర సెట్స్‌కి వచ్చిన శ్రీలీలను చిరు సత్కరించడంతో పాటు వెండి వర్ణంలో ఉన్న శంఖాన్ని ప్రత్యేక కానుకగా అందించారు. ఇక ఈ విషయాన్ని తెలియాజేస్తూ శ్రీలీల సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకుంది. విత్ ఓజీ వెండితెరపై మనం ఎంతగానో ఇష్టపడే మన శంకర్‌దాదా ఎంబీబీఎస్. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక బహుమతి. మీ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. రుచికరమైన విందును ఏర్పాటు చేసినందుకు థాంక్స్ అని రాసుకోచ్చింది.
