టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఎమోషనల్ డ్రామా రంగమార్తాండ. మరాఠీ సూపర్ హిట్ మూవీ నట సామ్రాట్‌కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్‌పై కామెడీతో నవ్వించిన లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం ఈ సారి మాత్రం సీరియస్ పాత్రలో డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు.
ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. బ్రహ్మానందం పోషించిన చక్రపాణి పాత్రపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్న బ్రహ్మానందంపై మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ ప్రశంసించారు. రంగమార్తాండ సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో బ్రహ్మానందంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి, రాంచరణ్ శాలువాతో సత్కరించారు.