Namaste NRI

మెగాస్టార్ కుటుంబంలో.. మెగా ఆనందం

రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులకు పండంటి కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. ఈ శుభవార్తతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. రామ్‌చరణ్‌ ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. మాకు బాబు, పాప పుట్టారనే విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడిని కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. మన జీవితంలో మహిళలే గొప్ప బలం. మాకు అండగా నిలిచిన కుటుంబం, అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు అని రామ్‌చరణ్‌ పేర్కొన్నారు.

ఈ దంపతులకు ఇప్పటికే కూతురు క్లీంకార ఉన్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో ఆనందం వ్యక్తం చేసిన చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడారు. హనుమాన్‌ కృపతో కవలలు జన్మించారని, ఉపాసనతో పాటు పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events