మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా బాస్ పార్టీ స్పెషల్ సాంగ్‌లో మెరువబోతుంది. వాల్తేరు వీరయ్య చిత్రంలో మాస్ మహారాజా పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
ఈ సినిమా నుంచి స్టన్నింగ్ సాంగ్ అప్‌డేట్ వచ్చింది. వాల్తేరు వీరయ్య నుంచి మెగామాస్ సాంగ్ పూనకాలు పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మెగా మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ పూనకాలు లోడింగ్.. అంటూ ఈ పాటను డిసెంబర్ 30 (రేపు)న లాంఛ్ చేయబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. చిరంజీవి, రవితేజ మాస్ బీట్‌తో ఇరగదీయబోతున్నట్టు తాజా పోస్టర్ చెబుతోంది. ముందుగా వచ్చిన అప్‌డేట్ ప్రకారం ఆర్‌టీసీ ఎక్స్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ఈ పాటను లాంఛ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.














