ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బ్లాక్‌బస్టర్ సాధించిన 2022లో చరణ్‌కు మంచి మెమోరబుల్ ఎక్స్ పీరియన్స్‌ను నిలపటమే కాకుండా 2023 ప్రారంభానికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. కాబట్టి రామ్‌చరణ్, ఎస్‌ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ లోగో ఉన్న బ్లాక్ కలర్ రాయల్ షూట్ వేసుకున్న స్టైలిష్ లుక్ ఉన్న ఫోటోను కూడా రామ్‌చరణ్ తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు.