మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించనున్న చిత్రంలో హీరోగా నటించనున్నారు చిరంజీవి. ఈ కాంబినేషన్ సెట్ అయిన విషయాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు మాధవి రాజు సహ నిర్మాత. ఈ సందర్భంగా డివీవీ దానయ్య మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలనే ఆకాంక్ష ప్రతి నిర్మాతకూ ఉంటుంది. నా ఆకాంక్షకు చిరంజీవి అభిమాని, వెంకీ బలం కూడా తోడయింది. పక్కా కమర్షియల్ మూవీగా రూపొందనున్న ఈ సినిమా కథ నచ్చింది అన్నారు. మెగా అభిమానులను అలరించే పక్కా కమర్షియల్ చిత్రమిది అన్నారు. ఇలాంటి అవకాశాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. నాపై నమ్మకం ఉంచిన చిరంజీవిగారికి, డీవీవీ దానయ్య, మాధవి రాజులకు ధన్యవాదాలు అన్నారు వెంకీ కుడుముల. త్వరలోనే ఇందులో ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను తెలియజేస్తాం అన్నారు.














