Namaste NRI

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర.. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న విశ్వంభర చిత్రం తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, త్రిష కృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ, ఓ పాట, యాక్షన్‌ బ్లాక్‌ని దర్శకుడు వశిష్ట తెరకెక్కించారు. పనిలోపనిగా చిరంజీవి, త్రిష, వశిష్ట, కీరవాణి, విక్రమ్‌, వంశీ, చోటా కె.నాయుడు, ఏఎస్‌ ప్రకాశ్‌ తదితరులు ఉన్న మరో పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్‌, వంశీ ప్రమోద్‌ ఈ చిత్రానికి నిర్మాతలు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రాని కి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోశ్‌ కామిరెడ్డి, స్క్రిప్ట్‌ అసోసియేట్స్‌: శ్రీనివాస్‌ గవిరెడ్డి, గంటా శ్రీధర్‌, నిమ్మగడ్డ శ్రీకాంత్‌, మయూఖ్‌ ఆదిత్య.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events