మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధమౌతోంది. యువ దర్శకుడు వశిష్ట ఈ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. క్లాప్‌బోర్డ్‌ను దర్శకుడు మారుతి డిజైన్ చేశారు. తొలి షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ పంచభూతాల నేపథ్యంలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ కథలో ముల్లోకాల కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని చెబుతున్నారు. భారీ గ్రాఫిక్స్ హంగులతో చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కే నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్, రచన-దర్శకత్వం: వశిష్ట.