
సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం టాలీవుడ్‌కు గర్వకారణంగా మారింది. దశాబ్దాల పాటు తెలుగు సినిమా అభివృద్ధికి వారు అందించిన సేవలకు దేశ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు సినీ పరిశ్రమకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ సంతోషకర సందర్భాన్ని మరింత గుర్తుండిపోయేలా చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అవార్డు ప్రకటన వెలువడిన వెంటనే ఆయన స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల నివాసాలకు వెళ్లి వారిని కలిశారు. శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమాకు దక్కిన ఈ జాతీయ గౌరవం ఒక చారిత్రక ఘట్టమని పేర్కొంటూ, ఇది భవిష్యత్ తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తుందన్నారు.















