టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న చిత్రం సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వం. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశాడు. ఫన్, ఫ్యామిలీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు. శ్రీవిష్ణు, నరేశ్ కామెడీ టచ్‌తో సాగే ట్రాక్ వినోదాన్ని అందించబోతున్నట్టు ట్రైలర్ చెబుతోంది. ఈ మూవీలో బిగిల్ (విజిల్) ఫేం రెబా మోనికా జాన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్, ప్రియ ఇతర నటీనటుల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన సామజవరగమన గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది. సామజవరగమన జూన్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.