Namaste NRI

లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి యుకే పార్లమెంట్‌ నుంచి అరుదైన సత్కారం అందుకున్నారు. చిరంజీవి యూకే పార్ల‌మెంట్‌లోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌తో సత్కరించారు. యూకే అధికార లేబ‌ర్ పార్టీ ఎంపీ న‌వేందు మిశ్రా ఆధ్వ‌ర్యంలో వేడుక జ‌రిగింది. పార్ల‌మెంట్ స‌భ్యులు సోజ‌న్ జోసెఫ్‌, బాబ్ బ్లాక్ మ‌న్ త‌దిత‌రులు పాల్గొని చిరంజీవికి అవార్డ్ అందించారు. చిరంజీవిని హౌజ్ ఆఫ్ కామ‌న్స్‌- యూకే పార్ల‌మెంట్‌లో ఘ‌నంగా  సత్కరించింది.

నిమాలతో పాటు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసింది బ్రిడ్జ్ ఇండియా సంస్థ. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీ రూపకల్పనలో కృషి చేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు,వారు తమ చుట్టూ ఉన్న స‌మాజంపై చూపించిన ప్ర‌భావం మ‌రింత విస్తృతం కావాల‌నే ఉద్దేశంతో ఇలా స‌త్క‌రిస్తూ ఉంటారు. అయితే బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా చిరంజీవికి అంద‌జేసింది. ఇది చిరంజీవి కీర్తి కీర‌టంలో మ‌రో క‌లికితురాయిగా నిలుస్తుంది.

Social Share Spread Message

Latest News