Namaste NRI

రంగమార్తాండ కు మెగాస్టార్ వాయిస్ ఓవర్

 ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం రంగమార్తాండ. మరాఠీలో సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న నటసామ్రాట్‌ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. నాటకాన్ని ప్రాణంగా భావించి దాన్నే ఆధారంగా చేసుకుని జీవించే కళాకారులు, వారి కష్టాలను తెలియజేసేలా ఈ సినిమా సిద్ధమవుతోంది. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ అందించారు. రచయిత లక్ష్మీభూపాల రాసిన వచన కవిత్వాన్ని చిరంజీవి తన వాయిస్‌ ఓవర్‌లో వినిపించారని సమాచారం. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ ట్విట్టర్‌ ద్వారా చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. మీ సహృదయానికి, ప్రేమకు కృతజ్ఞతలు అన్నయ్య .. ఈ సినిమాకు మీ గళం కొత్త వెలుగుల్ని తీసుకొచ్చింది అని కృష్ణవంశీ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events