బాబీ సింహా హీరోగా నటిస్తున్న చిత్రం వసంత కోకిల. బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్గా నటిస్తోంది. రమణన్ దర్శకుడు. రజనీ తాళ్లూరి, రేష్మి సింహా నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్‌ను అగ్ర నటుడు చిరంజీవి విడుదల చేశారు. 40 ఏళ్ల క్రితం కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ టైటిల్ వసంతకోకిల తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. దర్శకుడు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ కూడా అందర్ని అలరించే విధంగా వుంది. ప్రేమకథకు సస్పెన్స్ ఎలిమెంట్ జతచేసి రూపొందించిన చిత్రమిది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబీ సింహా రుద్ర పాత్రలో నటిస్తున్నాడు. నటుడు ఆర్య ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపిస్తాడు. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, భాషల్లో విడుదల చేస్తున్నాం అన్నారు.














