సినీ దర్శకుడు మెహర్ రమేశ్ కుమార్తె మోహన వివాహం అనిరుద్ తో వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా హాజరయ్యారు, సినీ ప్రముఖులు వెంకటేష్, మురళీమోహన్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు , అంబటి రాంబాబు, గంటా శ్రీనివాసరావు, మంత్రి నాదెండ్ల మనోహర్, పీ వి పీ, బండ్ల గణేశ్, ఏయం రత్నం, అల్లు అరవింద్, బి ఆర్ ఎస్ నాయకులు వినోద్ కుమార్, దర్శకుడు కొరటాల శివ, వి వి వినాయిక్, గుణ శేఖర్, శ్రీను వైట్ల, నృత్య దర్శకుడు ప్రభుదేవా, నిర్మాత స్వప్న దత్, సుమ మొదలగు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.




































