తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ను మెల్బోర్న్కు చెందిన ఎన్నారైలు కలుసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు గురించి లోకేష్‌తో చర్చించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి ఎన్నారైలుగా తమ వంతు కృషి చేస్తామని వారు లోకేష్‌కు తెలియజేసారు. త్వరలో ప్రారంభం కానున్న లోకేష్ పాదయాత్ర విజయవంతం ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ భేటీలో విక్టోరియా స్టేట్ తెలుగుదేశం ప్రెసిడెంట్ దేవేంద్ర పర్వతనేని, ఇతర సభ్యులు బలుసు కిషోర్, గుంటూరు జిల్లా నాయకురాలు యడ్లపల్లి వాణి తదితరులు పాల్గొన్నారు.