Namaste NRI

మేమ్‌ ఫేమస్‌ చిత్ర ట్రైలర్‌ విడుదల  

స్వీయ దర్శకత్వంలో సుమంత్‌ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రం మేమ్‌ ఫేమస్‌.  మేమ్‌ ఫేమస్‌ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  నాని మాట్లాడుతూ  ఈ చిత్ర దర్శకుడు, హీరో సుమంత్‌ ప్రభాస్‌ గతంలో చేసిన షార్ట్‌ఫిల్మ్‌ చూశాను. అప్పుడే అతనిలో మంచి టాలెంట్‌ ఉందని అర్థమైంది. ఈ సినిమాతో అతను మరో స్థాయికి చేరుకుంటాడు అని అన్నారు. మంచి కంటెంట్‌తో ఈ సినిమా తీశారు. టాలెంటెడ్‌ యూత్‌ అందరూ కలిసి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రమోషన్స్‌ కూడా కొత్తగా చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ట్రెండ్‌ సృష్టించడం ఖాయం అన్నారు.

ఈ సినిమానే జీవితం అనే పట్టుదలతో టీమ్‌ అంతా శ్రమించాం. యువతను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశాం. ఎక్కడా అసభ్య సన్నివేశాలు కనిపించవు. పెద్దలు కూడా ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తారు  అని దర్శకుడు, హీరో సుమంత్‌ప్రభాస్‌ పేర్కొన్నాడు. నిర్మాతల్లో ఒకరైన శరత్‌ మాట్లాడుతూ యువతరం తలచుకుంటే ఏదైనా సాధించగలరనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆద్యంతం వినోదంతో ఆకట్టుకంటుంది  అన్నారు. ఈ చిత్రం  ఈ నెల 26న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events