స్వీయ దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా మేమ్ ఫేమస్. లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ పతాకాలపై అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు. మణిఏగుర్ల, మౌర్యచౌదరి, సార్య , సిరిరాసిఇతరకీలకపాత్రలుపోషిస్తున్నారు. ఆదివారం జరిగిన మేమ్ ఫేమస్ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక, ఉపాధి కల్పన శాఖా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. టీజర్ విడుదల అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మొన్ననే దర్శకుడు హరీష్‌శంకర్ మా ఇంటికొచ్చి పవన్‌కల్యాణ్ సినిమాలో విలన్‌గా నటించమని గంటసేపు బతిమిలాడిండు. విలన్ పాత్రలో నటించనని చెప్పిన. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను కూడా సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీద్దామని ప్లాన్ చేస్తున్నా. అవి కూడా తెలంగాణ మోడల్‌లోనే ఉంటయి అన్నారు. సుమంత్ ప్రభాస్ తెలంగాణ నుంచి వచ్చిన హీరో. ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఇండియాలో ఫేమస్ మినిస్టర్ ఎవరైనా ఉన్నరంటే అది మన కేటీఆర్ అని గర్వపడాలి. కష్టపడి ప్రజల్లో ఉన్నవారే ఫేమస్ అవుతారు. యువత క్రమశిక్షణ అలవర్చుకొని కష్టపడితేనే విజయాలు దక్కుతాయి. అందరూ బతుకుతారు. కానీ ఫేమస్‌గా బతికే ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు పాలమ్మిన నేను సీఎం కేసీఆర్‌గారి ఆశీర్వాదంతో క్యాబినెట్ మినిస్టర్ అయ్యాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు. మంచిగా కుదిరిన మటన్ కర్రీలాంటి సినిమా ఇదని దర్శకుడు , హీరో సుమంత్ ప్రభాస్ చెప్పారు. కొత్త కంటెంట్‌తో యువతను ప్రోత్సహించాలని ఈ సినిమా చేశామని, గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

