స్వీయ దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మేమ్ ఫేమస్. చాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మా తోటి మినిమమ్ అనే పాటను విడుదల చేశారు. కల్యాణ్ నాయక్ సంగీతాన్నందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ ఊర్లో పోరగాళ్లం..ఏదో లొల్లి చేసేదాక మేం గమ్మునుండం అంటూ పాట ఆద్యంతం హుషారుగా సాగింది. తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో నడిచే వినోదాత్మక చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం జూన్ 2న విడుదలకానుంది. ఈ చిత్రానికి నిర్మాతలు: అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్, బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, హరి ఫిల్మ్స్, సంగీతం: కళ్యాణ్ నాయక్, డీవోపీ: శ్యామ్ దూపాటి, ఎడిటర్: సృజన అడుసుమిల్లి, ఆర్ట్ : అరవింద్ మూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి, పీఆర్వో: వంశీ-శేఖర్, క్రియేటివ్ ప్రోడ్యూసర్స్: ఉదయ్-మనోజ్.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-191.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/45af6911-9449-466d-a7e1-ba146800284b-137.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/638bff07-efd2-4cc9-8546-98039833db3c-139.jpg)