Skip to main content

Namaste NRI

మెర్సి కిల్లింగ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

సాయికుమార్‌, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మెర్సి కిల్లింగ్‌. వెంకటరమణ ఎస్‌ దర్శకుడు. మాధవి తాలబత్తుల నిర్మాత. రామరాజు, సూర్య, ఆనంద్‌ చక్రపాణి తదితరులు నటిస్తు న్నారు.  ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను యువ హీరో ఆకాష్‌ పూరి విడుదల చేశారు. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాష్‌ పూరి ఆకాంక్షించారు.దర్శకుడు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. స్వేచ్ఛ అనే అనాథ బాలిక న్యాయ పోరాటం నేపథ్యంలో కథ నడుస్తుంది అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌.జి, సంగీతం: ఎం.ఎల్‌.రాజా, దర్శకత్వం: వెంకటరమణ.ఎస్‌.

Social Share Spread Message

Latest News