Namaste NRI

వాట్సాప్ కు పోటీగా సందేశ్

వాట్సాప్‌కు పోటీగా కేంద్రం సందేశ్‌ అనే సరికొత్త యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. సందేశ్‌ యాప్‌ గురించి కేంద్ర సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ లోక్‌సభలో సభ్యులకు వివరిస్తూ.. సందేశ్‌ యాప్‌ పనితీరు వివరాలను రాతపూర్వకంగా అందజేశారు. సందేశ్‌ యాప్‌ చాలా సురక్షితమైన ఓపెన్‌ బేస్డ్‌ యాప్‌ అన్నారు. క్లౌడ్‌ ఎనేబుల్‌ టెక్నాలజీతో పని చేసే ఈ యాప్‌ కంట్రోలింగ్‌ పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలిపారు. వన్‌ టూ వన్‌ మెసేజింగ్‌,  గ్రూప్‌ మేసేజింగ్‌తో పాటు ఫైల్‌ షేరింగ్‌, వీడియో షేరింగ్‌, ఆడియో, వీడియో కాల్స్‌ సౌలభ్యం, ఈ గవర్నమెంట్‌ అప్లికేషన్‌ ఫీచర్లు ఉండేలా సందేశ్‌ యాప్‌ని రూపొందించారు. ఆండ్రాయిడ్‌ యూజర్స్‌, ఐఓఎస్‌ యూజర్స్‌ కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌తో పాటు యాప్‌ స్టోర్‌లోనూ సందేశ్‌ యాప్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. మొబైల్‌ లేదా ఈమెయిల్‌ ఐడీతో లాగిన్‌ అయ్యేలా డిజైన్‌ చేసినట్టు వివరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events