కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మీటర్. అతుల్య రవి కథానాయిక. రమేష్ కడూరి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మార్చి 29న ట్రైలర్ బ్లాస్టింగ్,‘ అనే మాస్ అప్పిలింగ్ ట్రైలర్ డేట్ అనౌన్స్మెంట్ చేశారు. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. విభిన్న కథాంశంతో రూపొందిస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ ఇది. కిరణ్ అబ్బవరం పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. తప్పకుండా అన్ని వర్గాల వారిని మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి దిలీప్, సంగీతం: సాయికార్తీక్, సమర్పకులు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, సంభాషణలు: రమేష్ కడూరి, సూర్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ కడూరి. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.