Skip to main content

Namaste NRI

నెక్ట్స్ లెవెల్ లవ్ స్టోరీగా.. మెట్రో లవర్ :నరేన్‌

నరేన్‌ వనపర్తి, సాహితి అవంచ ప్రధాన పాత్రధారులుగా మహేశ్‌ నాంపెల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మెట్రో లవర్‌. మాల్య కందుకూరి, శివకుమార్‌ రాజంపేట, గడ్డం రవికుమార్‌, సంతోష్‌ జాదవ్‌ నిర్మాతలు. భీమ్స్‌ సిసిరోలియో సంగీత దర్శకుడు. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

ఇది నెక్ట్స్‌ లెవల్‌ లవ్‌స్టోరీ అని, చూసినవారంతా సర్‌ప్రైజ్‌ అవుతారని హీరో నరేన్‌ చెప్పారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిజాయితీగా, ఇష్టంతో చేసిన సినిమా ఇదని సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో తెలిపారు. అంచనాలకు మించి సినిమా ఉంటుందని, ఇలాంటి కథ ఇప్పటివరకూ రాలేదని దర్శకుడు నమ్మకంగా చెప్పారు. ఇంకా నిర్మాతలతోపాటు బెక్కెం వేణుగోపాల్‌ కూడా మాట్లాడారు. నవంబర్‌ 20న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events