మెక్సికో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఆ దేశానికి తొలిసారి ఓ మహిళ దేశాధ్యక్షురాలు కానున్నది. ఎన్నికల్లో క్లాడియా షీన్‌బామ్ విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది. మెక్సికో సిటీ మేయర్‌గా ఉన్న 61 ఏళ్ల క్లాడియా సుమారు 56 శాతం ఓట్లతో దేశాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించనున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రత్యర్థి వ్యాపారవేత్త జోచిల్ గాల్వేజ్‌పై షీన్‌బామ్ గెలుపు దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. ప్రాథమిక ఫలితాల్లో షీన్‌బామ్ చాలా లీడింగ్‌లో ఉన్నట్లు స్పష్టమైంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ కన్ఫర్మ్ అయితే, ప్రస్తుతం దేశాధ్యక్షు డు ఆండ్రెస్ మాన్యువల్ లోపేజ్ ఒబ్రాడర్ స్థానంలో షీన్‌బామ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ ఒకటో తేదీన ఆమె కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. లోపేజ్ ఇబ్రాడర్ చేపట్టిన పనులను కొనసాగించనున్నట్లు షీన్‌బామ్ తెలిపింది.