Namaste NRI

ఫిబ్రవరి 3న  మైఖేల్ వస్తున్నాడు

సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న సినిమా మైఖేల్‌ . దివ్యాంశ కౌశిక్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ నాయికలుగా నటిస్తున్నారు. దర్శకుడు రంజిత్‌ జయకోడి. శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, కరణ్‌ సి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూస్కూర్‌ రామ్మోహన్‌రావు, భరత్‌ చౌదరి నిర్మాతలు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, వరుణ్‌ సందేశ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో ఫిబ్రవరి 3న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.  నారాయణదాస్‌ కె నారంగ్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కిరణ్‌ కౌశిక్‌, సంగీతం : సామ్‌ సీఎస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress