Namaste NRI

మైఖేల్ టీజర్ ఆరోజే

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి తెరకెక్కిస్తున్నారు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం టీజర్ ఈ నెల 20న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఆ ప్రచార చిత్రంలో సందీప్, దివ్యాంశకు ముద్దిస్తూ కనిపించారు. వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న చిత్రమిది. సందీప్ దివ్యాంశల కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో గౌతమ్ మేనన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సిఎస్, ఛాయాగ్రహణం: కిరణ్ కౌశిక్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events