మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. 27 ఏండ్లపాటు నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలను అందించిన వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (ఐఈ) పనిచేయబోదు. విండోస్ 10 తదితర వెర్షన్లలో ఐఈ డెస్క్‌టాప్ యాప్ సేవలు జూన్ 15 నుంచి నిలిచిపోనున్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడిరచింది. ఈ వెర్షన్‌ను వినియోగించే యూజర్లు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (ఎంఈ)కు మారాలని సూచించింది. అత్యాధునిక వెబ్‌సైట్లు, యాప్స్ సేవలను అత్యంత వేగంగా, వినూత్నంగా అందించేందుకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చక్కని వేదిక అని పేర్కొంది. జూన్ 15న ఐఈ సేవలను నిలిపివేస్తున్నట్టు గత ఏడాది మేలోనే మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. కాగా ఐఈ సేవలు నిలిచిపోతుండటంతో 1990 దశకంలో జన్మించిన వాళ్లు ఐఈ సేవలను గుర్తుచేసుకుంటూ వీడ్కోలు సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)