అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ట్రంప్ అంచనాలను తలకిందలు చేస్తూ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై ఘన విజయం సాధించారు. ఆదేశ 132 ఏండ్ల చరిత్రలో నాలుగేండ్ల విరామం తర్వాత తిరిగి ప్రెసిడెంట్ కాబోతున్న రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధ్యక్షడిగా శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన పాలకవర్గం కూర్పును వేగవంతం చేశారు.
తాజాగా అమెరికా తదుపరి జాతీయ భద్రతా సలహాదారుగా కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్‌ను ట్రంప్ నియమించి నట్లు తెలిసింది. అమెరికా ఆర్మీలోని ప్రత్యేక భద్రతా దళం అయిన గ్రీన్ బెరెట్‌గాలో ఆర్మీ కల్నల్‌గా రిటైర్డ్ అయిన వాల్జ్ 2019 నుంచి ప్రతినిధుల సభలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఇండియా కాకస్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.