వరుణ్‌తేజ్ హీరోగా సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రం రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై రూపొందుతోంది. అల్లు బాబీ సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, ఉపేంద్ర, లహరి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీపై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని దీపావళి పండగకి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటించడం జరుగుతోంది. అయితే వరుణ్ తేజ్ చిత్రం విడుదల తేదీని ప్రకటించడంతో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.